Andhra Pradesh: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలి.. ఏపీ ప్రభుత్వ జీవోలన్నీ కొట్టేస్తున్నాం: హైకోర్టు సంచలనాత్మక తీర్పు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై తీర్పు
- నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేత
- పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం లేదన్న హైకోర్టు
ఏపీ సీఎం జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది.
అంతేగాక, ఈ విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టివేసినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డినెన్స్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను తొలగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.