Nimmagadda Ramesh: మళ్లీ పదవిలోకి వచ్చాను.. 'స్థానిక' ఎన్నికలపై సమావేశం నిర్వహిస్తాను: నిమ్మగడ్డ రమేశ్ కీలక వ్యాఖ్యలు

nimmagadda on ap high court verdict

  • వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలి
  • వ్యక్తులు శాశ్వతంగా ఉండరు 
  • రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయి
  • పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఏపీ హైకోర్టు  తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని ఆయన చెప్పారు.

వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను మళ్లీ పదవిలోకి వచ్చానని ప్రకటించారు. తాను ఇకపై కూడా గతంలో మాదిరిగానే నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాననీ, పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News