Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే!
- ట్రేడింగ్ చివర్లో పుంజుకున్న కొనుగోళ్లు
- 224 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 90 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం 2 గంటల వరకు కొంత ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. ఆ తర్వాత కొంతమేర కొనుగోళ్లు పుంజుకోవడంతో... వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి.
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 32,424కి పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్లు ఎగబాకి 9,580 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం సూచీలు మినహా మిగిలినవన్నీ లాభాలను ఆర్జించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (5.52%), బజాజ్ ఆటో (4.43%), ఐటీసీ (3.62%), నెస్లే ఇండియా (3.48%), ఎల్ అండ్ టీ (3.24%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.25%), యాక్సిస్ బ్యాంక్ (-1.96%), భారతి ఎయిర్ టెల్ (-1.83%), టీసీఎస్ (-1.68%), టైటాన్ కంపెనీ (-1.02%).