Kishan Reddy: పోలవరానికే జాతీయ హోదా... కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు: కిషన్ రెడ్డి

Kishan Reddy clarifies special status demands for Kaleswaram
  • కాళేశ్వరానికి జాతీయ హోదాపై స్పష్టతనిచ్చిన కిషన్ రెడ్డి
  • కొన్ని పేద రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా లేదని వెల్లడి
  • విభజన చట్టంలో పోలవరానికే జాతీయ హోదా ఉందని స్పష్టీకరణ
విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే జాతీయ హోదా ఇవ్వాలన్న అంశం ఉందని, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పలు పేద రాష్ట్రాలు ఉన్నా, ఆ రాష్ట్రాల్లోనూ జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుల్లేవని కిషన్ రెడ్డి వివరించారు.

ఒకవేళ ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా వచ్చేలా పాటుపడతానని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తూ భారీ బడ్జెట్ కేటాయింపులతో ప్రాజెక్టును చేపడుతోంది.  
Kishan Reddy
Kaleswaram Project
Polavaram Project
Telangana
Andhra Pradesh

More Telugu News