Tirumala: తెరచుకోనున్న తిరుమల... దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు!

Tirumala Darshan Starts from any Time
  • భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు
  • వైద్య పరీక్షల తరువాతనే తిరుమలకు
  • దర్శనానికి సమయం తప్పనిసరి
లాక్ డౌన్ 5.0లో మరిన్ని నిబంధనల సడలింపులను కేంద్రం ప్రకటించిన వేళ, జూన్ 8వ తేదీన కోట్లాది మంది కొంగుబంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయాన్ని తెరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు జరిగిపోయాయి. క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు. అలిపిరి, కాలి నడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తరువాతనే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఆన్ లైన్ తో పాటు కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తామని, దర్శనం ఉన్న భక్తులకు మాత్రమే తిరుమలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లను ధరించడం, చేతులకు గ్లౌజ్ లు వేసుకోవడం తప్పనిసరని తెలిపారు.

ఇదిలావుండగా, నేటి నుంచి హైదరాబాద్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించనున్నారు. హిమాయత్ నగర్ లోని టీటీడీ కేంద్రానికి ఇప్పటికే 40 వేల లడ్డూలు చేరుకున్నాయి. స్వామివారి దర్శనాలు నిలిచిన నేపథ్యంలో లడ్డూలను అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల వ్యవధిలో 13 లక్షల లడ్డూలను అధికారులు విక్రయించారు.
Tirumala
Tirupati
Darshan
TTD
Laddu

More Telugu News