Donald Trump: జీ-7లోకి భారత్‌ను చేర్చుకునేందుకు ట్రంప్ సంకేతాలు.. కీలక వ్యాఖ్యలు
- జీ-7ను మరింత విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదన
- ప్రస్తుతం ఉన్న జీ-7 కాలం చెల్లినదిగా అభివర్ణన
- జీ-7ను విస్తరించే వరకు సమావేశాల వాయిదా
- రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణకొరియానూ ఆహ్వానించాలన్న ట్రంప్
జీ-7ను మరింత విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు జీ-7 ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీ-7 కాలం చెల్లినదిగా ఆయన అభివర్ణించారు. జీ-7ను విస్తరించే వరకు సమావేశాల వాయిదాకు ట్రంప్ పిలుపునిచ్చారు.
జీ-7లో భారత్‌తో పాటు రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాను ఆహ్వానించాలని ఆయన ప్రతిపాదన చేశారు. జూన్ 12న అమెరికాలో జీ-7 సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ట్రంప్ ప్రకటనతో ఆ సమావేశ నిర్వహణ సందిగ్ధంగా మారింది. ప్రపంచంలో ప్రస్తుతం చోటు చేసుకుంటోన్న పరిణామాలపై జీ-7 సరిగ్గా స్పందించట్లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.