rana: రానా, మిహీకాల గురించి మరో వార్త ప్రచారం!
- ఆగస్టు 8న పెళ్లి
- ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్
- ఇప్పటివరకు స్పందించని రానా కుటుంబం
సినీనటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ను గురించి మరో వార్త ప్రచారం జరుగుతోంది. ఇటీవల వారి నిశ్చితార్థం జరిగిందంటూ ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇటీవలే ఈ రెండు కుటుంబాల వారు కలిసి ఈ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.
ఈ ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి ఉంటుందని సురేశ్‌బాబు కూడా ప్రకటించారు. అయితే, ఈ ఏడాది ఆగస్టు 8న వారి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంపై మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై రానా కుటుంబ సభ్యులు ఇప్పటివరకు స్పందించలేదు.