Trains: రేపటి నుంచి పట్టాలెక్కనున్న 200 రైళ్లు

Two hundred more trains set to run from tomorrow

  • నేటితో నాలుగో విడత లాక్ డౌన్ ముగింపు
  • సోమవారం నుంచి వివిధ మార్గాల్లో రైళ్లు
  • రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ తప్పనిసరి అన్న రైల్వే శాఖ
  • లక్షణాలు లేనివారికే ప్రయాణానికి అనుమతి

కరోనా కట్టడి కోసం విధించిన నాలుగో విడత లాక్ డౌన్ నేటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. సోమవారం నుంచి 200 రైళ్లు వివిధ మార్గాల్లో నడవనున్నాయి. రేపు ఈ రైళ్ల ద్వారా లక్ష మందికి పైగా ప్రయాణించనున్నారు.

ప్రస్తుతం 30 శ్రామిక్ రైళ్లు నడుస్తుండగా, ఈ 200 రైళ్లు వాటికి అదనం. ఈ సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించింది. కన్ఫాం, ఆర్ఏసీ టికెట్ ఉన్నవారినే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రయాణికులంతా 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించింది. రైల్వే స్టేషన్ లో స్క్రీనింగ్ తప్పనిసరి అని, లక్షణాలు లేని వారికే అనుమతి లభిస్తుందని తెలిపింది.

  • Loading...

More Telugu News