IYR Krishna Rao: తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయి: 'నిమ్మగడ్డ' వ్యవహారంపై ఐవైఆర్ కృష్ణారావు
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ విషయంపై స్పందన
- ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
- ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి చేర్చుకునే విషయంపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. 'కొన్ని విషయాలు తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.
ఈసీ సమగ్రత పట్ల అగౌరవం దురదృష్టకరమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నట్లు అందులో ఉంది. ఏపీ ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.