Unlock 1.0: ఇండియాలో కరోనా కేసులపై అసలు వాస్తవమిది: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్!

Corona Virus Fact Sheet by Prashant Kishore
  • లాక్ డౌన్ 1.0, అన్ లాక్ 1.0 మధ్య కేసుల వివరాలు
  • 1002 రెట్లు పెరిగిన కొత్త కేసులు
  • 68 జిల్లాల నుంచి 634 జిల్లాలకు వ్యాపించిన వైరస్
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత విధించిన లాక్ డౌన్ ను దశలవారీగా పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, నేటి నుంచి అన్ లాక్ తొలి దశను ప్రకటించిన వేళ, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. లాక్ డౌన్ తొలి దశ నుంచి అన్ లాక్ 1.0 మధ్య కరోనా కేసులు 1002 రెట్లు పెరిగాయని, మరణాలు 1,348 రెట్లు పెరిగాయని అన్నారు.

ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని అన్నారు. టెస్టుల తరువాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ ఇండియా ఉందన్నారు.

మార్చి 20 నాటికి 190 కేసులున్న భారతావనిలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయని, రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల వారం రోజుల యావరేజ్ అప్పట్లో 16గా ఉండగా, ఇప్పుడు 461 రెట్లు పెరిగి 7,384కు చేరిందని అన్నారు.
Unlock 1.0
Lockdown
Prashant Kishor
Fact Sheet

More Telugu News