Rasi: నేను ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లోనూ లేను: రాశి

I dont have any financial problems says Rasi
  • రాశి ఇబ్బందుల్లో ఉన్నారంటూ ప్రచారం
  • ఈ వార్తల్లో నిజం లేదన్న రాశి
  • కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని వ్యాఖ్య
బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన రాశి... ఆ తర్వాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. అన్ని రకాల పాత్రలను పోషించి అభిమానుల మన్ననలు పొందారు. చివరకు వ్యాంప్ క్యారెక్టర్ లో సైతం నటించి మెప్పించారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి పరిమితమైపోయిన రాశి ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. తల్లి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు, రాశి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినీ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారంపై రాశి స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పారు. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని... వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.
Rasi
Tollywood
Financial Problems

More Telugu News