Air Asia: వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

Air Asia offers seats for doctors with no base fare

  • కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు
  • వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయించిన ఎయిర్ ఏషియా
  • కనీస చార్జీ మినహాయింపు

వ్యాక్సిన్ గానీ, ప్రత్యేక చికిత్సా విధానం గానీ లేని కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది పాత్ర అసమానమైనది. ఎలా స్పందిస్తుందో తెలియని ప్రాణాంతక వైరస్ తో నిత్యం పోరాడుతున్న వైద్యుల కోసం ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది.

ఈ సీట్లకు కనీస చార్జీని మినహాయించారు. సదరు ప్రయాణికుడు కేవలం ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. జూలై 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. సంప్రదింపుల వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఐడీ వంటి వివరాలు అందిస్తే ఎయిర్ ఏషియా వర్గాలు వాటిని పరిశీలించి టికెట్ మంజూరు చేస్తాయి.

  • Loading...

More Telugu News