Andhra Pradesh: నిమ్మగడ్డ వ్యవహారంలో.. హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

ap govt on high court verdict

  • నిమ్మగడ్డ‌ను తిరిగి చేర్చుకోవాలని ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పు
  • స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ నేపథ్యంలో తీర్పుపై స్టేపై హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి
  • సుప్రీంకోర్టులో బీజేపీ నేత కామినేని కేవియట్ దాఖలు 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి చేర్చుకోవాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పు అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో తీర్పుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. మరోవైపు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టులో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కేవియట్ దాఖలు చేశారు. తమ పార్టీ అధిష్ఠానం అనుమతితోనే తాను ఈ పిటిషన్ వేశానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News