Bollywood: ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి... బాలీవుడ్ షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతి

Bollywood shootings will be started with new guidelines
  • మార్గదర్శకాలు విడుదల చేసిన మహా సర్కారు
  • సెట్స్ పై భౌతికదూరం తప్పనిసరి
  • ఓ సెట్ పై అత్యధికంగా 50 మందికే అనుమతి
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ముంబయిలో ఇప్పటికీ పరిస్థితి తీవ్రంగానే ఉంది. అయినప్పటికీ మహారాష్ట్ర సర్కారు బాలీవుడ్ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... నటీనటులు ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి. షూటింగ్ స్పాట్ లో కచ్చితంగా భౌతికదూరం పాటించాలి. సెట్స్ పై హత్తుకోవడాలు, ఫైట్లు, కిస్సింగ్ సీన్ల చిత్రీకరణకు అనుమతి లేదు.

ఇక, పెళ్లి సీన్లు, మార్కెట్ సీన్లకు నో చెప్పారు. కరచాలనం చేయడం, సిగరెట్లు షేర్ చేసుకోవడం ఇకపై వీలు కాదు. స్టూడియోలోకి కానీ, సెట్స్ పైకి కానీ రాగానే శానిటైజేషన్ తప్పనిసరి. ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక సెట్ పై 50 మంది కంటే ఎక్కువగా ఉండరాదు. అయితే, ఈ మార్గదర్శకాలతో సినిమాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఫిలిం మేకింగ్ పూర్తిగా మారిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Bollywood
Shootings
Permission
Guidelines
Mumbai
Maharashtra

More Telugu News