SBI: పొదుపు ఖాతాలపై మరింత తగ్గిన వడ్డీ!

Intrest Rate Reduced on Savings Account

  • వడ్డీ రేటు 2.70 శాతానికి కుదించిన ఎస్బీఐ
  • ఇప్పటికే అమలులోకి వచ్చిన నిర్ణయం
  • పావు శాతం వడ్డీని తగ్గించిన ఐసీఐసీఐ

ఇండియాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ ఎకౌంట్లపై వడ్డీని మరింతగా తగ్గించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీని 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించింది.

ఇదే సమయంలో రూ. 50 లక్షల లోపు ఉండే ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 3 శాతానికి, రూ. 50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీని 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ తగ్గింపు 4వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News