Twitter: తన శరీరం గురించి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి హీరోయిన్ వాణికపూర్ సమాధానం

vani kapoor reply to netizen
  • నీకు హృదయం ఉంది కదా?
  • కాస్త మనసుతో ఆలోచించు
  • అనవసరంగా ఎదుటివారిని ద్వేషించొద్దు
సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్లపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తోన్న ఘటనలు అధికమైపోతున్నాయి. తాజాగా, బాలీవుడ్‌ హీరోయిన్ వాణి కపూర్ శరీరంపై ఓ నెటిజన్ అసభ్యకరరీతలో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ అతడికి దీటుగా సమాధానం ఇచ్చింది.

'నీకు హృదయం ఉంది కదా? కాస్త మనసుతో ఆలోచించు. అనవసరంగా ఎదుటివారిని ద్వేషించొద్దు' అని ఆమె పేర్కొంది. నెటిజన్ తన శరీరం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆమె చాలా సంయమనంతో బదులివ్వడంపై ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో చాట్ చేయగా ఆమెకు ఈ అనుభవం ఎదురైంది.
Twitter
Instagram
Social Media
Bollywood

More Telugu News