Andhra Pradesh: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు

Centre accepts Jagan request to extend tenure of CS
  • ఈ నెలాఖరుతో ముగుస్తున్న సీఎస్ పదవీకాలం
  • 6 నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసిన జగన్
  • మూడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆమె పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. సీఎస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. నవ్యాంధ్రప్రదేశ్ కు ఆమె తొలి మహిళా చీఫ్ సెక్రటరీ కావడం గమనార్హం.
Andhra Pradesh
Chief Secretary
Tenure
Extension
Neelam Saahni
Jagan
YSRCP

More Telugu News