Social Media: మానసిక ప్రశాంతత కోసం కాస్త బ్రేక్ తీసుకున్నా: ప్రియా ప్రకాశ్ వారియర్

For menta peace only i moved away from social media says Priya Prakash Varrier
  • ఈ మధ్య సోషల్ మీడియాకు దూరమైన ప్రియ
  • ఇన్స్టాగ్రామ్ నుంచి డీయాక్టివేట్ అయిన వైనం
  • పబ్లిసిటీ కోసం  దూరం కాలేదని వివరణ
మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్... 'ఒరు ఆడార్ లవ్' చిత్రంలో కన్నుగీటే సీన్ తో రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా పెద్ద సెలబ్రిటీ అయింది. కేరళలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు ఏకంగా 72 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకు దూరమైంది. ఇన్స్టాగ్రామ్ లో డీయాక్టివేట్ అయింది. దీనికి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, ఆమె మళ్లీ ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. పబ్లిసిటీ కోసం తాను సామాజిక మాధ్యమానికి దూరంగా వెళ్లలేదని చెప్పింది. అలాంటి అవసరం తనకు లేదని... మానసిక ప్రశాంతత కోసం కాస్త బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.
Social Media
Priya Prakash Varrier

More Telugu News