Lockdown: సినిమా హాళ్ల పునఃప్రారంభంపై జూన్ తర్వాతే నిర్ణయం: కేంద్ర మంత్రి

prakash Javadekar says decision will taken after june about cinema halls reopening
  • జూన్ తర్వాత కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం నిర్ణయం
  • వివిధ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
  • నష్టపోతున్నా లాక్‌డౌన్‌పై సంఘీభావంగా ఉన్నారంటూ ప్రశంస
లాక్‌డౌన్ కారణంగా దాదాపు 70 రోజులుగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ. 30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్‌డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
Lockdown
Film Industry
Prakash Javadekar
Corona Virus

More Telugu News