Rajendra Shukla: సోనూ సూద్ ను సాయం కోరిన బీజేపీ నేత... 'మీరేం చేస్తారంటూ' విమర్శల వెల్లువ!

BJP Leader Asks Sonu Sood To Help Migrants

  • ముంబయిలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ వాసులు
  • వారిని పంపేందుకు చర్యలు చేపట్టాలని రాజేంద్ర శుక్లా ట్వీట్
  • తాము చేయాల్సిన పనిని బీజేపీ వదిలేసిందని కామెంట్లు

ముంబయిలో చిక్కుకుని ఉన్న వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సహకరించాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజేంద్ర శుక్లా, తన ట్విట్టర్ ఖాతా ద్వారా నటుడు సోనూ సూద్ ను కోరి విమర్శలు కొనితెచ్చుకున్నారు. ముంబయిలో ఉండిపోయిన వలస కార్మికుల పేర్లను తెలియజేస్తూ, రాజేంద్ర శుక్లా, తన సోషల్ మీడియాలో ఓ పోస్టును పెడుతూ, వారికి సాయం చేయాలని సోనూ సూద్ ను కోరారు.

దీనిపై స్పందించిన సోనూ సూద్ "వలస కార్మికులను రేపు పంపిస్తాను సార్. నేను ఎప్పుడు మధ్య ప్రదేశ్ కు వచ్చినా, నాకు పూహాను పంపించండి" అంటూ సమాధానం ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉందికానీ, ఆపై శుక్లాపై విమర్శలు వెల్లువెత్తాయి.

 కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత, ఇలా తాము చేయాల్సిన పనిని వదిలేసి, ఇలా ఓ నటుడి సాయం కోరడం ఏంటని పలువురు ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రజలను వెనక్కు తెప్పించుకోవడంలో విఫలమైందని నిప్పులు చెరగుతున్నారు. తమ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఆయన ఈ పని చేసుంటారని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News