Woman: కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరిన భర్త ఆచూకీ చెప్పడం లేదంటూ.. హైకోర్టులో భార్య పిటిషన్!

Woman files petition on Telangana High Court

  • హైదరాబాదులో ఓ కుటుంబానికి కరోనా
  • భర్త, భార్య సహా అందరూ ఆసుపత్రిలో చేరిక
  • భర్త తప్ప అందరూ డిశ్చార్జి

కొన్నిరోజులుగా హైదరాబాదులో ఓ మహిళ తన భర్త ఆచూకీ కోసం పోరాడుతోంది. భర్తతో సహా ఆమె కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆసుపత్రిలో చేరగా, భర్త తప్ప అందరూ డిశ్చార్జి అయ్యారు. తన భర్త గురించి అడిగితే సరైన సమాధానం రావడంలేదని ఆ మహిళ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరిన తన భర్త ఆచూకీ చెప్పాలంటూ కోరింది. తన భర్త బతికే ఉన్నా వివరాలు చెప్పడంలేదని, ఒకవేళ చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడంలేదని తన పిటిషన్ లో ప్రశ్నించింది. తన భర్తను హాజరు పరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఆమె భర్త మరణించాడో, బతికున్నాడో చెప్పాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ మరణిస్తే భార్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News