Tejaswini: సందీప్ ను గ్యాంగ్ వార్ కు ముందు రోజే బెదిరించారు.. భార్య తేజస్విని

Tejaswini talk to media about Sandeep murder
  • ఇటీవల విజయవాడలో గ్యాంగ్ వార్
  • తోట సందీప్ అనే యువకుడు మృతి
  • పక్కా స్కెచ్ తో హత్య చేశారన్న భార్య
ఇటీవల విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ లో తోట సందీప్ అనే యువకుడు హత్యకు గురికావడం తెలిసిందే. దీనిపై సందీప్ భార్య తేజస్విని మీడియాతో మాట్లాడింది. సందీప్ ను పక్కా స్కెచ్ తో హత్య చేశారని ఆరోపించింది. ల్యాండ్ సెటిల్మెంట్ కు, సందీప్ కు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేసింది. గ్యాంగ్ వార్ కు ముందు ఒకరోజు ఫోన్ లో బెదిరించారని తెలిపింది. సందీప్ హత్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తేజస్విని విజ్ఞప్తి చేసింది. సందీప్ హత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని కోరింది.
Tejaswini
Sandeep
Gang War
Vijayawada

More Telugu News