Tuna: కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారుల వలకు భారీ చేపలు!

Fishermen caught to big fishes at Kakinada port area
  • మత్స్యకారుల వలలకు రెండు కొమ్ము కోణం చేపలు
  • రెండు చేపల బరువు 250 కిలోలు!
  • గతంలో ఇలాంటి చేపలను చూడలేదన్న స్థానికులు
దేశంలో చేపల వేటపై నిషేధాన్ని 15 రోజుల ముందే ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దాంతో మత్స్యకారులు ఉత్సాహంతో సముద్రంలో చేపల వేటకు వెళుతున్నారు. ఈ క్రమంలో, కాకినాడ పోర్టు ఏరియాలోని కుంభాభిషేకం రేవులో మత్స్యకారులకు రెండు భారీ చేపలు వలకు చిక్కాయి. ఒక్కోటి 125 కిలోల బరువుతో ఔరా అనిపిస్తున్నాయి. వీటిని కొమ్ము కోణం చేపలు అంటారని స్థానికులు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సైజులలో కొమ్ము కోణం చేపలు చూడలేదని అన్నారు. ఈ చేప మాంసం కిలో ధర రూ.1000కి పైగా పలుకుతుందని తెలిపారు. వీటిని జపాన్, హాంకాంగ్ వంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు.
Tuna
Fish
Kakinada
Port
Andhra Pradesh

More Telugu News