New Fighter Jet: దేశీయంగా మరో యుద్ధ విమానాన్ని రూపొందించిన భారత్... ఆరేళ్లలో గగనవిహారం

New fighter jet for India within decade

  • పదేళ్లలో భారత్ కు మరో యుద్ధ విమానం
  • రెండు ఇంజన్ల ఫైటర్ జెట్ కు రూపకల్పన
  • విమాన వాహక నౌకల నుంచి కార్యకలాపాలు

దేశీయంగా తయారైన లైట్ కంబాట్ ఫైటర్ జెట్ తేజస్ ఇటీవలే భారత వాయుసేనలో చేరింది.  తేజస్ అందించిన స్ఫూర్తిగా కేంద్రం తాజాగా మరో యుద్ధ విమానం రూపకల్పనకు నడుం బిగించింది. వచ్చే ఆరేళ్లలో ఇది గగన విహారం చేయనుంది. మరో పదేళ్లలో దీన్ని నేవీకి అందిస్తారు.

ఈ కొత్త యుద్ధ విమానాన్ని సముద్రాల్లో నిలిపి ఉంచే విమాన వాహక నౌకల పైనుంచి నిర్వహించేందుకు అనువుగా తయారుచేయనున్నారు. తేజస్ కు భిన్నంగా ఇందులో రెండు ఇంజన్లను ఏర్పాటు చేశారు. ఈ అత్యాధునిక జెట్ ఫైటర్లను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లపై మోహరించాలన్నది భారత రక్షణ వ్యూహకర్తల ప్రణాళిక!

ఈ సరికొత్త ఫైటర్ అందుబాటులోకి వస్తే భారత నేవీ అధీనంలోని మిగ్-29కే యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించాలని నిర్ణయించారు. కొంతకాలంగా మిగ్-29కే విమానాల్లో లోపాలు తలెత్తుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News