Handri Neeva: హంద్రీనీవా ప్రాజెక్టుకు మళ్లీ పాత పేరే ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Governmenr renamed Handri Neeva project

  • 2007లో అనంత వెంకటరెడ్డి పేరిట ప్రాజెక్టుకు నామకరణం
  • 2014లో చంద్రబాబు సర్కారు రాక
  • మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగింపు
  • పాత పేరును పునరుద్ధరించిన జగన్ సర్కారు

దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు 'అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు' అంటూ నామకరణం చేశారు. 2007లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అనేక కరవు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలంటూ మాజీ ఎంపీ, దివంగత నేత అనంత వెంకటరెడ్డి (ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఈయన తనయుడే) అనేక ఉద్యమాలు చేశారు. అనంత గౌరవార్థం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు.

అయితే, 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగా ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టుకు పాతపేరునే పునరుద్ధరించారు. ఇకపై దీన్ని పాతపేరు 'అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి'గా పిలవాలని నిర్ణయిస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

  • Loading...

More Telugu News