Facebook: ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తితో భార్య పరారీ... పోలీసులను ఆశ్రయించిన భర్త!

Married Lady Missing with Facebook Lover
  • తాండూరు సమీపంలో ఘటన
  • ఫేస్ బుక్ ఎకౌంట్ ను క్లోజ్ చేసి మరీ పరారీ
  • కేసును విచారిస్తున్న పోలీసులు
ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తితో తన భార్య పరారైందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తెలంగాణలోని తాండూరు సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, కోత్లాపూర్ కు చెందిన విక్రమ్ గౌడ్ కు, అదే గ్రామానికి చెందిన అనితకు 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి పిల్లలు కలుగలేదు. ఇటీవల అనితకు ఫేస్ బుక్ లో అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

ఈ క్రమంలో గత నెల 26న ఆమె ఇంటి నుంచి పారిపోగా, బంధుమిత్రులను, తెలిసిన వారిని విచారించిన విక్రమ్ గౌడ్, అతనితోనే తన భార్య వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు, ఇమ్రాన్ షేక్ తన ఫేస్ బుక్ ఖాతాను కూడా క్లోజ్ చేశాడని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.
Facebook
Lover
Wife
Police
Tandoor

More Telugu News