secunderabad: తగ్గుతున్న రైలు ప్రయాణికులు.. సికింద్రాబాద్ స్టేషన్‌లో నిన్న ‘గోదావరి’ ఎక్కింది 1,276 మందే!
- తొలి రోజు పోటెత్తిన ప్రయాణికులు
- రిజర్వేషన్ చేసుకున్న వారు కూడా విరమించుకుంటున్న వైనం
- అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూకట్టారు. స్క్రీనింగ్ తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతించడంతో ఆ క్యూ రోడ్డుపైకి వచ్చేసింది.
అయితే, వారం తిరిగే సరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రైల్వే చార్ట్ ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో నిన్న 1,516 మంది ప్రయాణించాల్సి ఉండగా 1,276 మంది మాత్రమే ఎక్కినట్టు అధికారులు తెలిపారు. అలాగే, హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో 1,493 మందికి గాను 1,400 మంది, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 620 మందికి గాను 421 మంది ఎక్కినట్టు అధికారులు తెలిపారు.