Vijay Sai Reddy: గతంలో తండ్రీకొడుకులకు సూట్ కేసులు అందించనిదే భూకేటాయింపులు జరిగేవి కావు: విజయసాయిరెడ్డి
- ఇప్పుడా చెడ్డపేరు తొలగిపోయిందని వెల్లడి
- జగన్ వచ్చాక పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వ్యాఖ్యలు
- పేరుకు మాత్రమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ విమర్శలు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు భారీగా తరలివస్తున్నారని, దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వనవసరంలేదని వాళ్లకు అర్థమైందని, గతంలో తండ్రీకొడుకులకు సూట్ కేసులు అందించనిదే భూకేటాయింపులు జరిగేవి కావని వ్యాఖ్యానించారు. ఇప్పుడా చెడ్డపేరు తొలగిపోయిందని తెలిపారు.
అటు, మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలోనూ విజయసాయి పలు వ్యాఖ్యలు చేశారు. పేరుకు మాత్రమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. ట్రస్టును భ్రష్టుపట్టించాడు కాబట్టే సైలెంటైపోయాడని, కానీ దర్యాప్తులో తప్పించుకోలేడని స్పష్టం చేశారు.