WHO: సడలింపులు ఇస్తుండడంతో ఇది పోయిందనుకుంటున్నారు... ఈ వైరస్ ఎక్కడికీ పోలేదు!: డబ్ల్యూహెచ్ఓ

WHO says it is not over

  • అనేక దేశాల్లో సడలింపు బాట
  • వైరస్ ప్రభావం తగ్గిందనుకుంటున్నారన్న డబ్ల్యూహెచ్ఓ
  • ఎవరి జాగ్రత్త వాళ్లు చూసుకోవాలని స్పష్టీకరణ

అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సడలింపులు ఇస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని,  సడలింపులు ఇచ్చినా ప్రజలు తమ జాగ్రత్త తాము చూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

యూరప్ దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతికదూరం సహా అనేక అంశాల్లో సడలింపులు ఇస్తుండడంతో ఈ వైరస్ ప్రభావం పోయిందన్న భావన ప్రజల్లో కలుగుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వైరస్ ఎక్కడికీ పోలేదని, ప్రపంచంలో ఎక్కడా ఈ వైరస్ లేదు అనేంతవరకు దీన్ని ఓ ముప్పుగానే పరిగణించాలని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News