pharmaceutical: ఫార్మా అధిపతి అమిత్ పటేల్‌పై 5 ఏళ్లపాటు నిషేధం విధించిన యూకే

Drugs firm boss banned from trade over NHS price fixing

  • ఔషధ ధరల నిర్ణయంలో అవకతవకలు
  • నిషేధ కాలంలో ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌ హోదాలో ఉండకూడదు 
  • ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమన్న సీఎంఏ

ఔషధ ధరల నిర్ణయంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత సంతతికి చెందిన ఫార్మా అధినేత అమిత్ పటేల్‌ (45)పై యూకే ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ కాలంలో ఆయన యూకేలోని మరే కంపెనీలోనూ డైరెక్టర్ హోదాలో కొనసాగడానికి వీల్లేదు. ఆరోపణలపై విచారణ  జరిపిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) అమిత్ పటేల్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల నిషేధం విధించింది.

ఈ సందర్భంగా సీఎంఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖెల్ గ్రెన్‌ఫెల్ మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్నవారు చట్టాన్ని అతిక్రమించి వినియోగదారుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటే సీఎంఏ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

సెప్టెంబరు 2014 నుంచి మే 2015 వరకు అడెన్ మెకెంజీకి అమిత్ పటేల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో కింగ్ ఫార్మా స్యూటికల్స్‌తో కలిసి ఓ ఔషధం సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారు. అంతేకాదు.. 1 మార్చి 2016 నుంచి అక్టోబరు 19 వరకు అమిల్కో ఫార్మా డైరెక్టర్‌గా కొనసాగిన సమయంలోనూ అమిత్ ఇటువంటి అవకతవకలకే పాల్పడినట్టు రుజువైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎంఏ అమిత్ పటేల్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News