Leopard: మహానంది దేవస్థానం సమీపంలో హడలెత్తించిన చిరుత
- పందిపిల్లను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత
- పందులన్నీ అరవడంతో వదిలేసి పొదల్లో నక్కిన వైనం
- ఆ తర్వాత కాసేపటికే మళ్లీ దాడి
లాక్‌డౌన్ నేపథ్యంలో వణ్యప్రాణాల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రోడ్లపైకి వస్తున్న చిరుతలు, ఇతర అటవీ జంతువులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నడిరోడ్డుపైకి వచ్చిన ఓ చిరుత ప్రజలను వణికించింది. తిరుమల ఘాట్ రోడ్డులోనూ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది.
తాజాగా, కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రం సమీపంలో కనిపించిన చిరుత ఓ పందిపిల్లను పట్టుకుని చెట్టెక్కింది. గమనించిన పందులన్నీ ఒక్కసారిగా అరవడంతో పందిపిల్లను వదిలేసి అడవివైపు వెళ్లి పొదల్లో నక్కి మాటువేసింది. ఆ తర్వాత కాసేపటికే పందులపై దాడిచేసి ఓ పందిపిల్లను నోట కరుచుకుని అడవిలోకి వెళ్లిపోయింది. గమనించిన గోశాల కాపలాదారు దేవస్థానం అధికారులు, స్థానికులకు సమాచారం అందించడంతో వారొచ్చి చిరుత కోసం గాలిస్తున్నారు.