Corona Virus: కరోనా వైరస్.. కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం!

Union Health Ministry issues new guidelines for hospitals amid rise of corona cases

  • కరోనా లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి
  • లక్షణాలు లేని వారిని 24 గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలి
  • స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండాలి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 2.30 లక్షలకు చేరుకున్న కేసుల సంఖ్య 3 లక్షల దిశగా సాగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.

ఆసుపత్రులకు వచ్చే వారిలో కరోనా లక్షణాలు ఉన్న వారికి, లక్షణాలు లేని వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అసలు లక్షణాలు లేని వారికి లేదా స్వల్ప లక్షణాలు ఉన్న వారికి  ఆసుపత్రి అవసరం లేదని తెలిపింది. ఇలాంటి వారిని ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు డిశ్చార్జ్ చేయాలని చెప్పింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తమ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News