Balakrishna: ముహూర్తం చూసుకునే ఇంట్లోంచి బయల్దేరతా... ఇలాంటివి పట్టించుకోను!: బాలకృష్ణ

Balakrishna comments on Tollywood shootings
  • షూటింగుకు ఎప్పుడైనా రెడీ అన్న బాలయ్య
  • వందలమందితో షూటింగుకైనా సిద్ధమేనని వెల్లడి
  • 2022 వరకు కరోనా పోదని వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వేళ తనకేమీ కాదని నమ్ముతున్నానని, షూటింగుకు తాను ఎప్పుడైనా రెడీ అన్నారు. ఇంట్లోంచి బయల్దేరే ముందు పూజలు అవీ చేస్తానని, మంత్రాలు చదువుతానని వెల్లడించారు. వందలమందితోనైనా షూటింగ్ నిర్వహించేందుకు తాను సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వైరస్ లు తననేమీ చేయలేవని, తన నమ్మకాలు తనవని స్పష్టం చేశారు.

అయితే, షూటింగ్ లు ప్రారంభమైతే ఒకట్రెండు రోజులు భౌతికదూరం పాటిస్తారని, ఆ తర్వాత అందరూ మర్చిపోతారని, ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయం అని బాలయ్య అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ఆఫీసుల్లో ఎవరి క్యూబ్ లో వారు కూర్చుని పనిచేసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ అలాకాదని వివరించారు.  మూడ్నాలుగు నెలలు షూటింగులు జరగకపోవచ్చని వెల్లడించారు. అంతేకాదు, కరోనా మహమ్మారి పోవాలంటే 2022 వరకు వేచి చూడకతప్పదని అన్నారు.
Balakrishna
Shootings
Tollywood
Lockdown
Corona Virus

More Telugu News