Southwest Monsoon: మరో రెండు, మూడ్రోజుల్లో రాయలసీమలోకి నైరుతి రుతుపవనాల ఆగమనం

IMD says Southwest Monsoon further advance in two three days

  • జూన్ 1నే కేరళను తాకిన రుతుపవనాలు
  • క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరణ
  • వాతావరణం అనుకూలంగా ఉందన్న ఐఎండీ

ఈ నెల 1నే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందజ వేయడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు మరో రెండు, మూడు రోజుల్లో విస్తరిస్తాయని వివరించింది. మధ్య అరేబియా సముద్రం, గోవా, కర్ణాటక, కొంకణ్, తమిళనాడులోని కొన్నిప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ ట్విట్టర్ లో తెలిపింది.

  • Loading...

More Telugu News