Tirumala: శ్రీవారి దర్శనం మొదలైందిలా!

Tirumala Re open Now
  • దాదాపు 80 రోజుల తరువాత దర్శనాలు
  • నిబంధనల మధ్య స్వామి దర్శనం
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దర్శనాలు లేక మూతబడిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఈ ఉదయం తిరిగి తెరచుకుంది. ఈ ఉదయం ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించగా, ఏళ్ల తరబడి స్వామివారి సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు స్వామిని దర్శించుకున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించిన ఉద్యోగులు, క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు.

Tirumala
Tirupati
Darshan

More Telugu News