Training Plane: కుప్పకూలిన ట్రైనింగ్ విమానం ఇద్దరి మృతి!

Two killed in Training plane crash incident in Odisha
  • ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో ఘోర ప్రమాదం
  • విమానం కుప్పకూలడంతో ట్రైనర్, విద్యార్థి దుర్మరణం
  • కరోనా నేపథ్యంలో ఈనెల 1వ తేదీన తెరుచుకున్న అకాడమీ
ఒడిశాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ట్రైనింగ్ విమానం కుప్పకూలడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన డెంకనాల్ జిల్లాలోని కనకదాహదాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ విమానయాన శిక్షణా సంస్థ విమానం శిక్షణ కోసం బయల్దేరింది. ఈ విమానంలో శిక్షకుడితో పాటు మహిళా పైలట్ (విద్యార్థి) ఉన్నారు. టేకాఫ్ అయిన 6 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదస్థలికి డెంకనాల్ ఎస్పీ, ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. శకలాలను తొలగించి మృత దేహాలను వెలికి తీశారు. మరోవైపు ఈ ఏవియేషన్ అకాడమీ కరోనా కారణంగా రెండున్నర నెలల పాటు నిలిచిపోయింది. జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయింది. మొత్తం 90 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండగా... రోజుకు 36 మందిని శిక్షణ విమానంలో తీసుకెళ్లి, ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో అకాడమీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Training Plane
Crash
Two Pilots
Odisha

More Telugu News