Chiranjeevi: సీఎం కేసీఆర్, తలసాని శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు: చిరంజీవి
- షూటింగులకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్
- మార్గదర్శకాలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుకోవచ్చని వెల్లడి
- కార్మికుల బతుకు తెరువు అంశాన్ని గుర్తించారంటూ చిరు స్పందన
మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ షూటింగులు నిర్వహించుకోవచ్చంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతి మంజూరు చేయడంపై టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. వేల మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, విధి విధానాలు రూపొందించి సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.