Electricity Bill: ఇలాంటి కరెంటు బిల్లు ఎవరికి వచ్చినా దిమ్మదిరిగిపోవడం ఖాయం... లక్షలు కాదు లక్షల కోట్లల్లో వచ్చింది!

Huge some of electricity bill shocks user in Madhya Pradesh

  • మధ్యప్రదేశ్ లో దిగ్భ్రాంతి కలిగించే రీతిలో కరెంటు బిల్లు
  • రూ.80 లక్షల కోట్ల బిల్లు అందుకున్న వినియోగదారుడికి నిజంగానే షాక్
  • ఫిర్యాదు చేస్తే పట్టించుకోని అధికారులు

సాధారణ నివాస గృహాలు ఉన్న వారికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది..? మహా అయితే రూ.500 లోపు , కొందరికి మినిమమ్ చార్జి వస్తుంది. ఇటీవల కాలంలో కరెంటు వాడుకోకపోయినా వేలల్లో బిల్లులు వస్తున్న ఘటనలు చూశాం. ఈ ఘటన మాత్రం వాటిని మించిపోయింది. ఎందుకంటే ఓ వినియోగదారుడు హైటెన్షన్ వైర్లు పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో షాకిచ్చారు.

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో బైదన్ గ్రామంలో ఓ వ్యక్తికి ఏకంగా రూ.80 లక్షల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. తన బిల్లులో కట్టాల్సిన మొత్తం చూసి ఎంతో లెక్కించడానికి అతడికి చాలా సమయం పట్టింది. గుండె గుభేల్మన్న అతగాడు ఎలాగోలా తేరుకుని అధికారులను సంప్రదిస్తే వారు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడి ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోలేదు. అసలైన బిల్లును ఇవ్వాలని కోరినా వారి నుంచి స్పందన కరవైంది. ప్రస్తుతం ఈ బిల్లు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News