Shakeela: 'షకీల రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం'కు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Shakeela film gets clean U certificate form censor board
  • విడుదలకు సిద్ధమైన షకీల కొత్త సినిమా
  • సినిమాలో జంటగా విక్రాంత్, పల్లవి ఘోష్
  • త్వరలోనే విడుదలపై నిర్ణయం
షకీల అంటేనే అందరికీ గుర్తుచ్చేవి గతంలో ఆమె చేసిన సినిమాలు. ఆమె ప్రధాన పాత్ర పోషించినవన్నీ 'ఏ' సర్టిఫికెట్ సినిమాలే. అయితే ఇటీవలి కాలంలో గౌరవ ప్రదమైన పాత్రలను ఆమె పోషిస్తున్నారు. శృంగార నటి అనే ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా షకీల ప్రధాన పాత్ర పోషించిన 'షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటించారు.

ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్ధమైన సమయంలో లాక్ డౌన్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క మ్యూట్ తప్ప మరెలాంటి కట్లు, మ్యూట్లు లేవని చిత్ర యూనిట్ తెలిపింది.

రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయని దర్శకుడు సాయిరాం దాసరి తెలిపాడు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
Shakeela
Tollywood
New Film
Censor Board

More Telugu News