Nagababu: వీళ్లకి జగన్ మోహన్ రెడ్డే కరెక్ట్: నాగబాబు

Nagababu Comments on AP Media
  • బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య  
  • చంద్రబాబు రక్షణ కవచంగా కొన్ని పత్రికలు
  • ట్విట్టర్ లో నాగబాబు వ్యాఖ్యలు
చంద్రబాబు తప్పులను ఎత్తి చూపిస్తుంటే, విపక్షాలకు కొన్ని పత్రికలు మద్దతుగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో ఒక్కోసారి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదే సరైనదని అనిపిస్తోందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు... వావ్... ఇది అసలైన వార్తాపత్రికల స్పిరిట్ అంటే..శభాష్...(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేంటి?)" అన్నారు నాగబాబు.
Nagababu
Twitter
Jagan
Media

More Telugu News