New Delhi: మద్యంపై విధించిన 70 శాతం సెస్‌ను ఉపసంహరించుకున్న ఢిల్లీ ప్రభుత్వం
- లాక్‌డౌన్ మూడో విడతలో మద్యం దుకాణాలకు అనుమతి
- వ్యాట్‌ను మరో ఐదు శాతం పెంచి 25 శాతం చేసిన ప్రభుత్వం
- కరోనా సెస్ ఉపసంహరణతో భారీగా దిగి రానున్న మద్యం ధరలు
ఢిల్లీలోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే. మద్యంపై విధించిన 70శాతం కరోనా సెస్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫలితంగా ధరలు అమాంతం తగ్గనున్నాయి. అయితే, ఇప్పటి వరకు మద్యంపై వసూలు చేస్తున్న 20 శాతం వ్యాట్‌కు అదనంగా మరో 5 శాతం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.
అయితే, విపరీతమైన రద్దీ కారణంగా సామాజిక దూరం గాలికి ఎగిరిపోయింది. దీంతో రద్దీని తగ్గించి సామాజిక దూరం అమలయ్యేలా చూసేందుకు మద్యంపై 70 శాతం కరోనా సెస్ విధించింది. తాజాగా, ఇప్పుడీ సెస్‌ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం వ్యాట్‌ను మరో ఐదుశాతం పెంచి 25 శాతం చేసింది. సెస్ ఉపసంహరణతో మద్యం ధరలు భారీగా దిగి రానున్నాయి.