Andhra Pradesh: ఏపీలో ఇక ఎస్సెమ్మెస్ ద్వారా కరోనా పరీక్ష ఫలితం

Corona Test Result Now On SMS In Andhrapradesh

  • మొబైల్ నంబరు నమోదు చేసుకుంటే ఎస్సెమ్మెస్
  • నిన్నటి నుంచే అమల్లోకి
  • జాప్యాన్ని నివారించి, త్వరగా చికిత్స అందించేందుకే..

ఏపీలో ఇక ఎస్సెమ్మెస్ ద్వారా కరోనా పరీక్ష ఫలితాలను తెలుసుకునే వెసులుబాటు లభించింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. సాధారణంగా కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫలితాలు తెలుసుకునేందుకు రెండు రోజుల సమయం పడుతోంది.

అయితే, ఇప్పుడీ జాప్యాన్ని నివారించి, బాధితులకు త్వరగా చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఎస్సెమ్మెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పరీక్ష చేయించుకున్న సమయంలో సెల్‌ఫోన్ నంబరు నమోదు చేయించుకుంటే సంబంధిత వ్యక్తి మొబైల్‌కు వైద్య ఆరోగ్య శాఖ ఓ లింకు పంపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫలితాన్ని చూసుకోవచ్చు.

కరోనా పరీక్షల ఫలితాన్ని వైద్యులు, సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యలు తలెత్తుతుండడంతో ఎస్సెమ్మెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆరోగ్య, సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.

  • Loading...

More Telugu News