Vijayawada: తెరచుకున్న కనకదుర్గమ్మ తలుపులు... క్యూ కట్టిన ఏపీ మంత్రులు!

Kanakadurgamma Temple Re open in Vijayawada
  • 12 వారాల తరువాత అమ్మ దర్శనం
  • ఆలయానికి వచ్చిన వెల్లంపల్లి, పెద్దిరెడ్డి
  • చాలా సంతోషంగా ఉందన్న పెద్దిరెడ్డి
దాదాపు 12 వారాల తరువాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలిరావడంతో భౌతిక దూరం పాటించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి రావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. చాలా రోజుల తరువాత అమ్మను చూడటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయం ఉన్న ప్రాంతంలో కరోనా కేసులు లేవని, కంటైన్ మెంట్ జోన్ ప్రాంతంలో ఇంద్రకీలాద్రి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అన్ని జాగ్రత్తలూ తీసుకుని దర్శనాలకు ఏర్పాట్లు చేయించామని వెల్లడించారు.
Vijayawada
Kanakadurgamma
Andhra Pradesh
Ministers
Darshan

More Telugu News