Supreme Court: నిమ్మగడ్డ రమేశ్ కేసులో స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ.. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దని హెచ్చరిక

supreme court on nimmagadda case

  • ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ 
  • రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం
  • ఆర్డినెన్స్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్య

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‌రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దని హెచ్చరించింది.

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారితో ఆటలు వద్దని చెప్పింది.

  • Loading...

More Telugu News