Uttam Kumar Reddy: పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను గృహ నిర్బంధం చేసిన్రు: వీడియో పోస్ట్ చేసిన ఉత్తమ్
- కరెంటు బిల్లులకు నిరసనగా ‘చలో సెక్రటేరియట్’కు పిలుపు
- కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తోన్న పోలీసులు
- మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? అని ఉత్తమ్ ఆగ్రహం
- కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు? అని ప్రశ్న
తెలంగాణలో వినియోగదారులకు వస్తోన్న కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపు చేస్తున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. దీనిపై ఉత్తమ్ మండిపడుతూ తన ఇంటి వద్ద ఉన్న పరిస్థితులపై ఓ వీడియో పోస్ట్ చేశారు.
'ఇవాళ పొద్దుటి నుండి పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను అకారణంగా గృహ నిర్బంధం చేసిన్రు. మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? ప్రజాస్వామ్యవాదులను చూసి కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు?' అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.