Janvi Kapoor: ఆ సమయంలో ఇంట్లో ప్రతి విషయాన్ని నా కంట్రోల్ లోకి తీసుకున్నాను: జాన్వి కపూర్

Janvi Kapoor tells home quarantine experiences

  • బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురు పనివాళ్లకు కరోనా
  • కుటుంబం మొత్తానికి హోమ్ క్వారంటైన్
  • క్వారంటైన్ లో అన్ని విషయాలు తానే పర్యవేక్షించానన్న జాన్వి

బాలీవుడ్ నటి జాన్వికపూర్ కుటుంబం ఇటీవలే ముంబయిలో హోం క్వారంటైన్ పూర్తి చేసుకుంది. జాన్వి, ఆమె తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ రెండు వారాల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అందుకు కారణం.. వారింట్లో ముగ్గురు పనివాళ్లకు కరోనా సోకడమే.

ఈ సందర్భంగా హోం క్వారంటైన్ అనుభవాలను జాన్వి తాజాగా మీడియాకు తెలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్నది ఈ సమయంలోనే అని చెప్పింది. పనివాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఎంతో భయాందోళనలకు గురయ్యామని, క్రమంగా పరిస్థితులకు అలవాటుపడ్డామని వివరించింది.

"క్వారంటైన్ లో ఉన్నన్నాళ్లు ఇంట్లో ప్రతి విషయం నా కంట్రోల్ లో ఉండేట్టు చూసుకున్నాను. మా నాన్న, చెల్లి ఆరోగ్యం నిత్యం పర్యవేక్షించేదాన్ని. వారు ఎప్పుడు, ఏంచేయాలో చెప్పేదాన్ని. దాంతో మా నాన్న నన్ను హెడ్ మాస్టర్ అని పిలవడం ప్రారంభించారు. క్వారంటైన్ మార్గదర్శకాల్లో భాగంగా ఇంట్లో అందరం ప్రతిరోజు వేడి నీళ్లు తాగడం, ఆవిరిపట్టడం చేసేవాళ్లం. మా నాన్నకు రాత్రివేళ వేడినీళ్లు కావాల్సి వస్తే చేతులకు తొడుగులు వేసుకుని, మాస్కు ధరించి కిచెన్ లోకి వెళ్లి వేడినీళ్లు సిద్ధం చేసేదాన్ని. ఇలా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నాను" అని జాన్వి పేర్కొంది.

  • Loading...

More Telugu News