Telangana: మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వైపుగా దూసుకెళుతున్న మిడతల దండు

Locust swarm travelling towards Madhya Pradesh

  • తెలంగాణకు తగ్గిన ముప్పు 
  • సరిహద్దులోని 9 జిల్లాల అధికారుల అప్రమత్తం
  • ఈ నెల 20 తర్వాత తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం

దేశంలోకి చొరబడిన మిడతల దండు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ వైపు బయలుదేరింది. రాంటెక్ నుంచి బయలుదేరిన ఈ మిడతల సమూహం 60 కిలోమీటర్లు ప్రయాణించి మెహాడీ అనే గ్రామం వద్ద ఆగినట్టు అధికారులు తెలిపారు.

అసలు ఇవి దక్షిణం వైపు ప్రయాణించి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావించారు. దీంతో సరిహద్దులోని 9 జిల్లాల అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే, అవి వ్యతిరేక దిశగా ప్రయాణించి మధ్యప్రదేశ్ వైపుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, అవి మళ్లీ ఏ వైపునకు తిరిగి ఎటు వెళ్తాయోనని భావించిన అధికారులు సరిహద్దుల వద్ద నిఘా కొనసాగిస్తున్నారు. ఈ నెల 20 తర్వాత మిడతలు మళ్లీ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. 

  • Loading...

More Telugu News