Ishant Sharma: ఇకపై క్రికెట్ బ్యాట్స్ మెన్ గేమ్ మాత్రమే: ఇషాంత్ శర్మ
- బంతికి స్వింగ్ తీసుకురావడానికి లాలాజలం వాడుతుంటాం
- స్వింగ్ లేకపోతే బ్యాట్స్ మెన్ కు ఆడటం ఈజీ అవుతుంది
- బాలర్లు, బ్యాట్స్ మెన్ మధ్య పోటీ న్యాయంగా ఉండాలి
కరోనా నేపథ్యంలో క్రికెట్ బంతిపై లాలాజలాన్ని ఉపయోగించకుండా ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటలో బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ అంశంపై స్పందిస్తూ... ఇకపై క్రికెట్ అనేది కేవలం బ్యాట్స్ మెన్ గేమ్ మాత్రమేనని ఒక్క ముక్కలో తేల్చేశాడు.
ఎర్ర బంతికి షైనింగ్ తీసుకురాకపోతే అది స్వింగ్ అవదని... అప్పుడు బ్యాట్స్ మెన్ కు ఆడటం చాలా ఈజీ అవుతుందని చెప్పాడు. బంతికి షైనింగ్ తెప్పించడానికి కొత్త బంతికి లాలాజలాన్ని వాడుతుంటామని... రివర్స్ స్వింగ్ సమయంలో పాత బంతిపై చెమట ఉపయోగిస్తుంటామని తెలిపాడు. బౌలర్లు, బ్యాట్స్ మెన్ల మధ్య పోటీ న్యాయంగా ఉండాలని... లేకపోతే క్రికెట్ బ్యాట్స్ మెన్ ఆట అయిపోతుందని చెప్పాడు.