Atchannaidu: రూ. 40 వేల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి.. పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నాడు: చంద్రబాబు

Chandrababu fires on Jagan

  • ఏ కేటాయింపుల్లోనూ మంత్రి ఉండడు
  • అచ్చెన్నాయుడును బలిపశువును చేయాలనుకుంటున్నారు
  • కక్ష సాధింపులు తప్ప రాష్ట్రంలో పాలనే  లేదు

అవినీతిపై పోరాడే  నాయకుడు అచ్చెన్నాయుడని... అందుకే ఆయనను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీని అడ్డుకుంటున్నామనే ఉన్మాదంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏ కేటాయింపుల్లోనైనా మంత్రి ఉండడని... అధికారులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ ఈఎస్ఐలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగితే అధికారుల పాత్రపై విచారణ జరిపించారని... ఏపీలో మాత్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడును బలిపశువును చేయాలనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రూ. 40 వేల కోట్ల అవినీతి చేసి 11 చార్జ్ షీట్లలో ఏ1గా ఉన్న జగన్ రాక్షసానందం పొందాలనుకోవడం దారుణమని చెప్పారు. నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని.. పైశాచికంగా కక్ష తీర్చుకుంటున్నాడని మండిపడ్డారు.

ఈ కారణాలన్నింటి వల్లే  'వి స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు' అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా తొలి స్థానంలో ఉందని చెప్పారు. కక్ష సాధింపులు తప్ప రాష్ట్రంలో పాలన లేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయని, 34 సంక్షేమ పథకాలను తీసేశారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News