Australia: స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఆస్ట్రేలియా నిర్ణయం

Australia eases corona rules

  • ఆస్ట్రేలియాలో అదుపులోకి వస్తున్న కరోనా
  • ఆంక్షలు సడలించాలని ప్రభుత్వ నిర్ణయం
  • త్వరలో క్రీడాపోటీల నిర్వహణకు మార్గదర్శకాలు

కరోనా వ్యాప్తి మొదలయ్యాక అనేక దేశాలు లాక్ డౌన్ విధించినా వైరస్ ను సమర్థంగా కట్టడి చేశాయి. కానీ ఆస్ట్రేలియా అత్యధికంగా ఆర్నెల్ల పాటు లాక్ డౌన్ విధించడమే కాదు, కఠిన ఆంక్షలు అమలు చేసి ఎక్కువ నష్టం జరగకుండా చూసుకుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7,209 మందికి కరోనా నిర్ధారణ కాగా, ప్రస్తుతానికి 405 మంది చికిత్స పొందుతున్నారు. ఆసీస్ గడ్డపై కరోనా మరణాల సంఖ్య కూడా చాలా తక్కువే అని చెప్పాలి. కరోనాతో 102 మంది మాత్రమే చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తుండడంతో కరోనా ఆంక్షలు క్రమంగా సడలించాలని ప్రధాని స్కాట్ మోరిసన్ భావిస్తున్నారు. ముఖ్యంగా, క్రీడారంగంపై కఠిన నిబంధనలు తొలగించాలని యోచిస్తున్నారు. ఇకపై స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన ద్వారా 40 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో 10 వేల మందిని అనుమతిస్తారు. అంతేకాదు, గ్యాలరీలు, స్టాండ్స్ లో సీట్ల మధ్య తగినంత దూరం ఉండాలని స్పష్టం చేశారు. త్వరలో వైద్య, ఆరోగ్య నిపుణులతో సంప్రదించి, వివిధ క్రీడా పోటీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందిస్తామని ప్రధాని వెల్లడించారు.

  • Loading...

More Telugu News